ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా:దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రప్రధమ ఆశాజ్యోతి అయిన మహనీయుడు జ్యోతిభాపూలే అని ప్రజా పోరాట సమితి (పీ.ఆర్.

 Glorious Mahatma Jyotirao Poole Jayanti Celebrations-TeluguStop.com

పీ.ఎస్)రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.సోమవారం జ్యోతిభాపూలే 195 వ జయంతి సందర్భంగా చిట్యాలలో ఆయన విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా జోహార్లర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మహామహోపాధ్యాయుడు కారల్ మర్క్స్ వర్గ దోపిడీ సిద్ధాంతాన్ని ప్రవచించిన అదేసమయంలో మన దేశంలో సామాజిక దోపిడీ సిద్ధాంతాన్ని ప్రవచించిన మహామహోపాధ్యాయుడు జ్యోతిభాపూలే అని” కొనియాడారు.

దేశంలో సామాజిక చైతన్యానికి ప్రప్రధముడు జ్యోతిభాపూలే అని,ప్రపంచవ్యాప్తంగా వర్గ సిద్ధాంతం ఎంత ముఖ్యమో,దేశ పరిస్థితుల్లో జ్యోతిభా పూలే ప్రవచించిన సామాజిక సిద్ధాంతం అంతే ముఖ్యమైందని తెలిపారు.దేశంలో సామాజిక ఉద్యమాలు మహోజ్వలంగా సాగకుండా అణగారిన వర్గాలకు న్యాయం జరగదని,జ్యోతిభా పూలే లేకపోతే సామాజిక ఉద్యమాల ప్రతీకలైన బరోడా రాజు సాహు,డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ లేరని,జ్యోతి భాపూలే చెప్పిన గులామ్ గిరి నేటికీ కొనసాగుతోందని దానిని తుదముట్టించడమే మన కర్తవ్యమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీ.ఆర్.పీ.ఎస్ జిల్లా నాయకులు నాగిళ్ళ యాదయ్య,ముప్పిడి మారయ్య,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,గుంటోజు శంకరయ్యచారి,బర్రె సంజీవ,పోతెపాక విజయ్,వల్కి నాగయ్య, మునుకుంట్ల శ్రీనివాస్ గౌడ్,కోనేటి శ్రీరామ్,నాగిళ్ళ ప్రకాశ్,పబ్బు చంద్రశేఖర్ గౌడ్,ముప్పిడి రాములు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube