నల్లగొండ జిల్లా:ప్రతీ రైతుకు సాగు నీరు అందాలని మిర్యాలగూడ ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.శనివారం వజీరాబాధ్ మేజర్ ద్వారా విడుదల చేసిన నీరు వారబంధీల వారీగా నిలిపివేయడం మూలాన కేనాల్ టైల్ చివరిలో ఉన్న గ్రామాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆయన ఇరిగేషన్ అధికారులతో కలసి వజీరాబాద్ మేజర్ కాలువ పూర్తిగా పరిశీలించారు.
వారబంధీల కారణంగా మైనర్ కాలువాలు అధికంగా ఉండటం మూలాన నీరు చివరి వరకు అందడం లేదని, వారబంధీలని నిలిపివేయాలని ఉన్నత అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.అలాగే కాలువల్లో పేరుకు పోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని,వాటి ద్వారా నీటి ప్రవాహం వేగం తగ్గటం మూలాన కూడా చివరి వరకు అందడం లేదన్నారు.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ప్రతీ ఒక్క రైతుకి నీరు అందేలా,ప్రతీ ఎకరాకు నీరు వచ్చేలా నీటిని విడుదల చేయిస్తానని తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రైతులు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,రైతులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.