నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను( Registration Code ) TS నుంచి TGగా మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.ఈ క్రమంలో తమ పాత వాహనాలపై ఉన్న నంబర్ ప్లేట్ల సంగతి ఏంటనే సందేహం వాహనదారుల్లో మొదలైంది.
అయితే TS నుంచి TGగా మారే ప్రక్రియ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కే పరిమితం అవుతుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు సమాచారం.ఇప్పటికే రిజిస్టర్ అయిన వాటికి TS కొనసాగుతుందని,కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చాకే TG తో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.