నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సీపీఎం నేతలు బి.
వి.రాఘవులు,మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి,జూలకంటి రంగారెడ్డి ఆమె చికిత్స పొందుతున్న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు.ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను,కుటుంబ సభ్యులను సిపిఎం నేతలు ఆరా తీశారు.మరి కొద్దీసేపట్లో మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బృందం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు,ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు,సీపీఎం పార్టీ నేతలు,కార్యకర్తలు,కమ్యూనిస్ట్ పార్టీల శ్రేణులు,అభిమానులు ఆందోళనలో ఉన్నారు.