కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరు

నల్లగొండ జిల్లా:ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం వెళ్లదీస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.

 No One Can Protect Kcr-TeluguStop.com

ప్రవీణ్ కుమార్ విమర్శించారు.రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలంలోని ఒగోడు,గుడివాడ, ఉప్పలగూడా,భీమారం తదితర గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ గ్రామాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు.ఎన్నికల ముందు అనేక ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టి వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు మయమైందని,పేద ప్రజలకు మాత్రం ఇబ్బందులు మిగిలాయని వ్యాఖ్యానించారు.ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు న్యాయం జరగకపోతే అత్యధికంగా బహుజన బిడ్డలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతకుముందు గుడివాడ గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శినితో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు.

అనంతరం ఒగోడు గ్రామంలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వారితో పాటుగా కొద్దిసేపు కూలి పనులు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube