నల్లగొండ జిల్లా:వ్యక్తిగత, కుటుంబ,ఆధ్యాత్మిక,సామాజిక వేడుకల్లో ఉన్నత, పేద,మధ్యతరగతి అనే తేడా లేకుండా ఉత్సవం ఏదైనా డీజే తప్పనిసరి అన్నంతగా మారింది నేటి సమాజం.కానీ,డీజే సౌండ్స్ వలన అనేక ప్రమాదకర శబ్ద కాలుష్యం తో పాటు కొందరు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డీజేలపై నిషేధం విధించాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది.దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో ఈ నెల 14 వరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించే డీజేలతో సహా అధిక వాల్యూమ్ సౌండ్ ఎమిటింగ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో డీజేలు నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా మానవ ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు పడుతున్న కారణంగా నిషేధించడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక శబ్ధం కలిగించే డిజేలను వినియోగించరాదని అన్నారు.
ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఉల్లంఘించి,ఎవరైనా వినియోగిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఇట్టి విషయంలో పోలీసు వారికి జిల్లా ప్రజలు సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు.