వైరల్ వీడియో: వేగంగా వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డ బైక్‌ రైడర్‌.. చివరకు..?

ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరిలో( West Godavari ) జరిగిన దారుణ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు .ఈ ఘోర ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

 Bike Hits Car After Passing The Auto At High Speed Video Viral Details, Bike Acc-TeluguStop.com

ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్‌ ను( Bike ) కారు వేగంగా ఢీకొట్టడం ఫుటేజీలో కనపడుతుంది.ఈ యక్షిడెంట్ లో భాగంగా ఓ రైడర్ గాలిలో 10 అడుగుల ఎత్తుకు ఎగిరిపడ్డాడు.బుధవారం నాడు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా బయకు రావడంతో.20 ఏళ్ల యువకుడు నడుపుతున్న మోటార్‌సైకిల్ అతివేగంతో( Overspeed ) ఆటోను ఓవర్‌ టేక్ చేయడానికి ప్రయత్నించడంతో ఈ సంఘటన జరిగింది.ఆటోను దాటేందుకు యువకుడు తల తిప్పుతుండగా, ఎదురుగా వస్తున్న కారు( Car ) అతడి బైక్‌ను ఢీకొట్టింది.ఇలా ఢీ కొనడంతో ఆ యువకుడు గాలిలో దాదాపు 10 అడుగుల ఎత్తుకు దూకి రోడ్డుపై పడిపోయాడు.

ఇక ఈ ఘటనలో మరో బైక్‌ పై వెళ్తున్న వ్యక్తి కూడా తన వాహనంపై అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రెయిన్‌లో పడిపోయాడు.

రోడ్డుపై ఉన్న ప్రజలు బాధితులను ఆదుకునేందుకు పరుగులు తీయగా యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజీలో ఘటనకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు రికార్డ్ కాగా ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేసి యక్షిడెంట్ కు( Accident ) కారణమైన వారిని తెలుసుకుని బాధ్యులను అరెస్ట్ చేస్తామన్నారు.మృతుడి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.ఈ విషాద సంఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబసభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube