హైదారాబాద్ హైడ్రా తరహా మిర్యాలగూడ మిడ్రా రావాలి

నల్లగొండ జిల్లా:హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లేనని,ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినా చెరువుల అన్యాక్రాంతంపై నోరు విప్పలేదని,రేవత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీటీడీపీ నాయకులు పోగుల సైదులు గౌడ్ అన్నారు.కానీ,అదే తరహాలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కూడా అన్యాక్రాంతమైన నాళాలు,పంటకాలువలు పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోడానికి మిడ్రా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Miryalaguda Midra Should Come Like Hyderabad Hydra, Miryalaguda, Midra , Hyderab-TeluguStop.com

అభివృద్ది పేరుతో నాళాలు కుదించి కట్టడం,పంట కాలువలు పూడ్చి వేయడం వలన వర్షాకాలంలో వీధులన్నీ జలమయం అవుతున్నాయన్నారు.

పట్టణంలోని నాళాలపై చాలా చోట్ల కబ్జా చేసి నిర్మాణాలు వేలిశాయన్నారు.

ఇప్పటికే కొన్ని చోట్ల దీనిపై వాదనలు కూడా జరిగాయన్నారు.పెద్ద లీడర్లు ఆక్రమించిన చోట అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా అమాయకపు పేద ప్రజల నివాసాలపై చర్యల పేరుతో తొలగించడం చేయటం చూశామని,ఇప్పటికైనా ప్రభుత్వము రాజకీయ నాయకులకు వంత పాడకుండా నాళాలు, పంటకాలవలు పునరుద్ధరించాలని,అర్హులైన పేదలకు మరొక చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube