గుడ్డు.సంపూర్ణ పోషకాహారం అని అందరికీ తెలుసు.
గుడ్డులో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటిమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డి.ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.అందుకు ఆరోగ్యానికి నిపుణులు కూడా రోజుకో గుడ్డు తినమని ప్రతి ఒక్కరికీ సూచిస్తుంటారు.కానీ, కొందరు గుడ్డు తినరు.
ఎలర్జీ, జీర్ణ సమస్యలు ఇలా రకరకాల కారణాల వల్ల గుడ్డును దూరం పెడతారు.దాంతో గుడ్డులో ఉండే పోషాలన్నీ మిస్ అవుతారు.
అయితే గుడ్డులోని పోషకాలను వేరే వేరే ఆహారాల ద్వారా కూడా బర్తీ చేయవచ్చు.మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ప్రోటీన్ లోపం ఏర్పడితే.గుడ్డు తినమని సూచిస్తుంటారు.
అయితే గుడ్డులోని ప్రోటీన్ కంటే ఎక్కువగా గుమ్మడి గింజల్లో లభిస్తుంది.రోజుకు ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకుంటే శరీరారికి పుష్కలంగా ప్రోటీన్‌తో పాటు జింక్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయి.
మెలకెత్తిన పెసలు గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్లు అందించడంతో పాటు రక్తహీనతకు చెక్ పెట్టే ఐరన్, బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేసే సోడియం, బరువును అదుపులోకి తెచ్చే ఫైబర్‌ను కూడా అందిస్తాయి.

పెసలే కాదు శెనగల్లో కూడా ప్రోటీన్ మరియు ఆరోగ్యానికి ఉపయోగపడే ఇతర పోషకాలు ఉంటాయి.అందువల్ల, గుడ్డుకు ప్రత్యామ్నయంగా శెనగలు కూడా తీసుకోవచ్చు.
అలాగే గుడ్డును దూరం పెట్టే వారు డైట్‌లో వెన్న, పెరుగు, పాలు, నెయ్యి వంటివి డైట్‌లో చేర్చుకుంటే.
ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.ఇక వీటితో పాటు బాదం, పల్లీలు, చిక్కుడు జాతి గింజలు, సోయాబీన్స్, పాలకూర, బచ్చలికూర, కిడ్నీ బీన్స్ వంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా.
గుడ్డులో ఉండే పోషకాలను బర్తీ చేయవచ్చు.