నల్లగొండ జిల్లా:బ్యాంకు అధికారుల బెదిరింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తేనెపల్లి తండాకు చెందిన వడిత్య జవహర్ లాల్ గుర్రంపోడు మండల కేంద్రంలోని ఎండిసిసిబి బ్యాంకులో మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నాడని,అతను రెండు వాయిదాలు చెల్లించలేదని,దాంతో బ్యాంకు అధికారులు నిత్యం బెదిరింపులకు దిగుతున్నారని,మంగళవారం అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్ కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్ వచ్చి నోటీసులు ఇస్తూ నానా హడావుడి చేసి రైతు భూమిని వేలం వేస్తామని బెదిరింపులకు పాల్పడడంతో అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు.
దీంతో గ్రామస్తులు హుటాహుటినా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి తరలించారు.ఇదే విషయమై అసిస్టెంట్ మేనేజర్ ఉదయ్ కుమార్ ని వివరణ కోరగా మేము మొండి బకాయి అవ్వడంతో నోటీసులు ఇవ్వడానికి వెళ్లామే తప్ప రైతుపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని తెలిపారు.