ఖాకీకి దేహశుద్ధి

నల్లగొండ జిల్లా:కామంతో కళ్ళు మూసుకుపోయి మహిళలపై,యువతులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఒక ఖాకీకి దేహశుద్ధి చేసి తిరిగి ఖాకీలకే అప్పగించిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.కంచే చేను మేస్తే కాపాడే వారెవరన్న చందంగా మారిన ఆ ఖాకీ వ్యవహరం పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

 Body Cleansing For Khaki-TeluguStop.com

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటుడు స్థానిక మహిళల,యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో స్థానికులే దేహశుద్ది చేసి టాస్క్ఫోర్స్ పోలీసులకు అప్పగించడంతో ఖాకీ కామ బాగోతం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి ప్రాంతానికి చెందిన ఓ ఖాకీ 2010 బ్యాచ్లో సివిల్ కానిస్టేబుల్ గా విధుల్లోకి చేరాడు.

ఆ తరువాత నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఓ కాలనీలో భార్య పిల్లలతో అద్దెకు ఉంటున్నారు.ఉన్నతాధికారులు నకిరేకల్లోని పోలీస్ స్టేషన్లో ఓ ప్రత్యేక విభాగంలో విధులు అప్పగించారు.

విధులు ముగించుకున్న తర్వాత రాత్రి వేళ్లలో మహిళలలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.గత కొంత కాలంగా తాను నివాసముంటున్న జిల్లా కేంద్రంలోని పద్మానగర్ కాలనీ,రాఘవేంద్ర కాలనీ,రవీంద్రనగర్,వివేకానంద నగర్,ఎన్టీ కాలనీ,సాయినగర్,వీటీ కాలనీ ప్రాంతాలతో పాటు విధులు నిర్వర్తిస్తున్న నకిరేకల్ లోనూ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసేవాడని సమాచారం.

తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్ళి ఉదయం నడక కోసం రోడ్డు వెంట వెళ్లే మహిళలను, యువతులను వెనుక నుంచి పట్టుకోవడం,ఇళ్ల ముందు ముగ్గులు వేస్తున్న మహిళలను చేతులతో తాకడం పనిగా పెట్టుకొని రక్షసానందం పొందేవాడని తెలుస్తోంది.ఒకటీ రెండుసార్లు పోలీసులు గుర్తించినా తనకున్న పరిచయాలతో కేసు కాకుండా బయటపడే వాడు.

ఇతడితో ఇబ్బందులు పడిన మహిళలు 50 మందికి పైనే ఉన్నారంటే పరిస్థితి ఎంత శృతి మించిందో అర్థం చేసుకోవచ్చు.అయినా బాధితులు ఇతనిపై కేసుపెట్టడానికి వెనుకంజవేసేవాళ్లు.

పద్మానగర్ కాలనీ ప్రాంతంలో అద్దెకు ఉన్న యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి మరో కాలనీలో ఇంటి గోడకు అంటించడంతో ఈ ఖాకీ పాపం పండింది.ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో బంధువులు,స్నేహితులతో కాపు కాసి పట్టుకుని దేహశుద్ధి చేయడంతో పాటు ద్విచక్ర వాహనంతో సహా పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

దీంతో అతడిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకటీ రెండు రోజుల్లో అధికారికంగా పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube