నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నల్గొండ నియోజకవర్గం ఇంచార్జి తుమ్మల మధుసూదన్ రెడ్డి,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యల్ వి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాధించుకోవడం రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని,అది సాధించుకున్న సందర్బంగా కెసిఆర్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసారని,అందులో భాగంగా రైతులకు రుణమాఫీ,ఇంటికో ఉద్యోగం,దళితులకు 3 ఎకరాల భూమి లాంటివి ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తయినా ఇందులో ఏ ఒక్క వాగ్దానాన్ని కెసిఆర్ అమలు చేయలేక పోయారని విమర్శించారు.తెలంగాణ ఏర్పాటు కెసిఆర్ కుటుంబ అవసరాలకు తప్ప తెలంగాణ సమాజ అభివృద్ధికి అక్కరకు రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా కెసిఆర్ కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ వాణిజ్య సెల్ అధ్యక్షులు కూరెళ్ల విజయ్ కుమార్, నల్గొండ పట్టణ అధ్యక్షులు ఆకునూరి సత్యనారాయణ,పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎంఎ.రఫీక్,తేలు అన్నరవి,కాంచనపల్లి క్రాంతి,చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.







