నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రం నుండి కొండమల్లేపల్లి వరకు గత కొంతకాలం నుండి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.ఎక్కడైతే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందో అక్కడ రోడ్డును పెగిలించి కొత్తగా కంకర,డస్ట్ వేసి చదును చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ దుమ్ము రాకుండా ఉదయం సాయంత్రం నీళ్లు కొట్టి చదును చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నీళ్లు కొట్టకుండా ఉండేసరికి ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్రంపోడు,కొప్పోలు సమీపంలో పెద్ద వాహనాలు వెళ్లే సమయంలో వస్తున్న దుమ్ముకి ఎదుటి వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో రోడ్డు మరమ్మతులు చేసేటప్పుడు రోడ్డుపై కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నత్తనడకన పనులు చేస్తూ,కంకర రాళ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయిందని అంటున్నారు.
ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు జరుగుతున్న చోట నిత్యం నీళ్ళు కొట్టి చదును చేసి దుమ్ము రాకుండా చూడాలని,ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్డుకు మరమ్మత్తు పనులు జరిగే చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పెద్దిరెడ్డి సాయిరెడ్డి అనే ప్రయాణికుడు అన్నటున్నారు.పెద్ద వాహనాలు వెళ్తున్న సమయంలో బైకుపై వెళ్తుంటే ఆ దుమ్ముకి ఏమీ కనిపించట్లేదు.
ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యతాలోపం కూడా కనిపిస్తుంది.
అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయించి,రోజు నీటితో చదును చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.