తెలంగాణ మందు బాబులకు షాక్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పదిరోజులే ఉండటంతో ప్రచారంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు.చివరి దశకు చేరుకోవడంతో ఉన్న అస్త్రాలు అన్నీ వాడుతున్నారు.

 A Shock To The Drug Lords Of Telangana , Telangana, Assembly Elections In Telang-TeluguStop.com

ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నికల వేళ మంచిగా చిల్ అవ్వొచ్చు అనుకున్న మందు బాబులకు ఎన్నికల సంఘం షాకిచ్చింది.

రాష్ట్రం మొత్తం మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు,బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. నవంబర్ 28,29,30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.

అయితే తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 28 నుంచి 30 వరకు వైన్ షాపులు,బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.

ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.గత ఎన్నికలు,ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube