షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం... సర్వం కోల్పోయిన కుటుంబం

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కొండేటి వెంకటయ్య ఇల్లు సోమవారం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది.వెంకటయ్య కుటుంబీకులు పొలం పనికి వెళ్లి వచ్చేసరికే మొత్తం కాలి బూడిదైంది.

 House Burnt With Short Circuit Madugulapalli Mandal, House Burnt ,short Circuit-TeluguStop.com

దట్టంగా మంటలు వ్యాపించడంతో గమనించిన గ్రామస్తులు నీళ్లతో చల్లార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఇంట్లో ఉన్న రూ.70 వేల నగదు బట్టలు, బియ్యం,వంట పాత్రలు మంచాలు, గృహోపకరణాలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుత‌య్యాయి.అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube