షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం… సర్వం కోల్పోయిన కుటుంబం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కొండేటి వెంకటయ్య ఇల్లు సోమవారం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది.
వెంకటయ్య కుటుంబీకులు పొలం పనికి వెళ్లి వచ్చేసరికే మొత్తం కాలి బూడిదైంది.దట్టంగా మంటలు వ్యాపించడంతో గమనించిన గ్రామస్తులు నీళ్లతో చల్లార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇంట్లో ఉన్న రూ.70 వేల నగదు బట్టలు, బియ్యం,వంట పాత్రలు మంచాలు, గృహోపకరణాలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రీల్స్ చూస్తూ వైద్యుడు నిర్లక్ష్యం.. మహిళ మృతి