పంద్రాగష్టున మహిళా కార్యదర్శిపై దాడి బాధాకరం:అనంత చారి

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మండలం( Miryalaguda ) ఐలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సంధ్యారాణిపై అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు పంద్రాగష్టు రోజున దాడి చేయడం హేయమైన చర్యని ఆర్టీఐ పర్యవేక్షణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతచారి ( Anantha Chari )అన్నారు.వేములపల్లి మండల కేంద్రం నుండి దాడి ఘటనను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

 Attack On Female Secretary Is Painful: Anantha Chari , Attack , Female Secretar-TeluguStop.com

పంద్రాగస్టు నాడు మహిళా ఉద్యోగిపై దాడి చేయడం బాధాకరమని, దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో చాలీచాలని జీతంతో,ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేకున్నా కరోనా సమయంలో రిస్క్ చేస్తూ ఉద్యోగం చేశారని, ప్రజా సమస్యల కోసం ప్రతి సోమవారం మండలంలో, గురువారం పంచాయతీలో ప్రజావాణి కార్యక్రమం ఉందని,ఏదైనా సమస్య ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చెయ్యాలని, ఫిర్యాదులను కార్యదర్శి పట్టించుకోకపోతే ఎంపీఓ, ఎంపీడీవో,డిఎల్పిఓ,డిపిఓ కలెక్టర్ కు ఫిర్యాదు చెయ్యాలి కానీ,ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube