నల్లగొండ జిల్లా:చండూరు మున్సిపాలిటీ( Chandur ) పరిధిలోని కొన్ని ఏళ్ల కింద నిర్మించిన ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర( Primary Health Centre ) భవనం శిథిలావస్థకు చేరి కూలెందుకు సిద్ధంగా ఉంది.ఇటీవల కురిసిన వర్షాలకు ఆస్పత్రి పైకప్పు తరచూ పెచ్చులు ఊడి పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, రోగులు ఆసుపత్రికి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
ఇదిలా ఉంటే భవనం పైభాగం పూర్తిగా దెబ్బతినడంతో విలువైన వైద్య పరికరాలు, మందులపై దుమ్ము ధూళి పడి పనికిరాకుండా పోతున్నాయని అంటున్నారు.
కిటికీ తలుపులు దెబ్బతినడం తో సిబ్బంది తాత్కాలికంగా అట్ట ముక్కలు పెట్టారు.
అయినా వర్షం వస్తే సామాగ్రి తడిసి ముద్ద అవుతున్నాయని వాపోతున్నారు.భవన మరమ్మతుల కోసం గత ప్రభుత్వం రూ.68 లక్షల నిధులు మంజూరు చేయాగా,పరిశీలించిన ఇంజనీర్ల బృందం భవనానికి మరమ్మతులు చేపట్టిన వృధా అని తేల్చి, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నూతన భవనం మంజూరు చేసి నిర్మించాలని,వైద్య సిబ్బంది,స్థానిక ప్రజలు కోరుతున్నారు.