నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ప్రజాపాలన మొదలైందని, రెండున్నర నెలల్లోనే నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ మరియు
గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి,పొదిల శ్రీను,సిద్దు నాయక్,అర్జున్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్,మహిళా కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.