రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చెయాలని సీపీఎం ధర్నా

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని పెద్దబండలో రోడ్డు వెడల్పులో భాగంగా తవ్వి వదిలేసిన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ డిమాండ్ చేశారు.శనివారం పెద్దబండలో రోడ్లు తవ్వి అసంపూర్తిగా వదిలేసిన గుంతల దగ్గర నిలబడి సిపిఎం పెద్దబండ శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

 Cpm Dharna To Complete Road Construction Immediately-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా రోడ్ల వెడల్పు పేరుతో ఉన్న రోడ్లను తవ్వి గుంతలమయం చేశారని అన్నారు.ఎండకు దుమ్ముతో,వర్షానికి నీటి గుంటలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు వెడల్పు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం,మున్సిపల్ అధికారుల అలసత్వం అక్కడి ప్రజలకు ప్రాణాంతకంగా మారిందన్నారు.వెంటనే మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ పై తగిన చర్య తీసుకొని అసంపూర్తిగా వదిలేసిన రోడ్లను నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

లేనియెడల పెద్దబండ ప్రజలతో మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో పెద్దబండ ఏరియా సిపిఎం నాయకులు నోముల యాదయ్య,మన్నె శంకర్,పాక మల్లయ్య,తెలకమళ్ళ శ్రీను,కోట సైదులు,ఖమ్మంపాటి మారయ్య,కావేటి కోటయ్య,బోయపల్లి చంద్రమ్మ,లక్ష్మమ్మ, లింగమూర్తి,యాదయ్య,సత్యనారాయణ, నాగయ్య,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube