నల్లగొండ జిల్లా:ఒకవైపు విప్లవాత్మకమైన వరి వంగడాలు వచ్చాయని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ పెరిగిందని,దీంతో ఎకరంలో పండే పంట పెరిగిందని చెబుతూనే,మరోవైపు కొనుగోలు కేంద్రాలలో ఎకరానికి 90 బస్తాల నుండి 70 బస్తాలకు తగ్గించడం ఆశ్చర్యకరంగా ఉందని,దీనిని యధాతధంగా 90 బస్తాలను కొనసాగించాలని ప్రజా పోరాట సమితి(పీఆర్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.ఆదివారం చిట్యాల మండలంలోని నేరడ,ఎలికట్టె, చిన్నకాపర్తి,పెద్దకాపర్తి గ్రామాల్లో ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం పరిమితి సడలించడంపై రేపు సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.గత 15 రోజులుగా గ్రామీణ మార్కెట్లకు రైతాంగం ధాన్యాన్ని తోలిందని,అయినా మాశ్చర్ చూసేవారూ, మార్కెట్ సిబ్బంది నేటికీ అతీగతీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఆర్ పీఎస్ నాయకులు చిట్టిమళ్ళ శ్రవణ్ కుమార్,నాగిళ్ళ యాదయ్య,పోతెపాక విజయ్,ధోటి నరేష్ యాదవ్, తంగెళ్ళ మధుసూదన రెడ్డి,పగిళ్ళ దశరథ,గుంటోజు నవీనాచారి తదితరులు పాల్గొన్నారు.