కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం:మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని,నిరంతరం పేదల పక్షాన నిలబడి,వారి సమస్యలపై పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి,సూర్యాపేట నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి( Ramreddy Damodar Reddy ) అన్నారు.గురువారం సూర్యాపేట రూరల్ మండలం,కాసరాబాద్ లో జరిగిన అభయహస్తం – ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Congress Government Is People's Government: Former Minister Ram Reddy Damodar Re-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అభయహస్తం-ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు ఈ నెల ఆరవ తేదీ వరకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను( Six guarantees ) వంద రోజుల వ్యవధిలోనే అమలు చేయడం జరుగుతుందని,కాబట్టి ప్రజలు తమ గ్రామాల్లో, పట్టణంలోని వార్డుల్లో దరఖాస్తులు ఇవ్వాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తరువాత,ఇప్పటివరకు ఆరు కోట్ల యాభై లక్షల మంది ఆర్టిసి బస్సులలో ప్రయాణించారన్నారు.రేషన్ కార్డులు లేని వారి నుండి మళ్లీ ఒకసారి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని,గత పదేళ్ల నుండి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదన్నారు.

రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని అన్నారు.ప్రజలు తప్పులు లేకుండా దరఖాస్తులు నింపి ఇవ్వాలని,రశీదును జాగ్రత్త పరచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి,ఎంపిడివొ శ్రీనివాసరావు,జెడ్పిటిసి జీడి భిక్షం, గ్రామ సర్పంచ్ కొల్లు రేణుక,నరేష్,పార్టీ మండల అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి,ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు చింతమల్ల రమేష్, మాజీ సర్పంచ్ సంకరమద్ది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube