చండూరు మున్సిపాలిటీకి ఏమైందీ...?

నల్లగొండ జిల్లా:చండూరు మున్సిపాలిటీ( Chandur Municipality ) మురికి కంపు కొడుతోందని తొమ్మిదో వార్డ్ ఇందిరా కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు.కాలనీలో గత కొంత కాలంగా మోరీలు,చెత్త కుప్పలు శుభ్రం చేయక చెత్త చెదారం పేరుకుపోయి, డ్రైనేజీ వ్యవస్థ( Drainage system ) దుర్గంధం వెదజల్లుతూ,దోమల బెడద ఎక్కువై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 What Happened To Chandur Municipality, Chandur Municipality, Drainage System ,-TeluguStop.com

.దీనితో పాటు కాలనీలో కుక్కల( Dogs )బెడద కూడా తీవ్రంగా ఉందని,అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్, కమిషనర్,కౌన్సిలర్లు స్పందించి ఇందిరా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాలనీకి చెందిన బూతురాజు వెంకన్న,సాయి,రమేష్, వెంకటాచారి,స్వామి,రాజు,అబ్దుల్లా తదితరులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube