సాధారణంగా ప్రతి మనిషికి కోపం ఉండడం సర్వసాధారణమైన ఎమోషన్.అయితే ఈ ఎమోషన్ మనిషిపై మానసికంగా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.ఎన్నో రకాల సమస్యలకు కారణం అవుతుంది.ఇక కోపం రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని మనందరికీ తెలుసు.అయితే కొన్ని సందర్భాల్లో కోపానికి విటమిన్ లోపం కూడా కారణమని చాలామందికి తెలిసి ఉండదు.అయితే విటమిన్ లోపం కారణంగా మనిషికి ఊరికే కోపం వస్తుంది.
ఇంతకీ ఏ విటమిన్ లోపం వల్ల తరచూ కోపం వస్తుంది.దీనికి చెక్ పెట్టడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ b6 లోపం ఉంటే మనిషి తరచుగా కోప్పడుతూ ఉంటాడు అని నిపుణులు చెబుతున్నారు.కోపం మానసికంగా ప్రభావం చూపిస్తుంది.మెదడు పనితీరు సరిగా పని చేయాలంటే ఆహారంలో విటమిన్ b6 ఉండేలా చూసుకోవాలి.శరీరానికి సరిపడా బేసిక్స్ విటమిన్ అందకపోతే నిత్యం కోపం వస్తుందని చెబుతున్నారు.
ఇక కోపం ఎక్కువగా రావడానికి మరో ప్రధాన కారణం విటమిన్ బి 12 లోపం. ఈ విటమిన్ లోపం వలన కూడా నిత్యం అలసట, నీరసం, కోపం ఎక్కువగా ఉంటుంది.

అనవసరమైన విషయాలకు చిరాకు రావడం ఈ విటమిన్ లోపమే కారణం.ఇక ఈ విటమిన్ లోపం కారణంగా డిప్రెషన్ కు కూడా గురవుతారని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా శరీరానికి సరిపడా జింక్ లభించకపోయినా మానసికంగా దెబ్బతింటారని, మానసిక ఆరోగ్యం పై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
జింక్ లోపం కారణంగా మానసిక కల్లోలం, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ లాంటివి వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మెగ్నీషియం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
శరీరానికి సరిపడా మెగ్నీషియం లేకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది.దీంతో నిత్యం చికాకు కలగడానికి కారణం అవుతుంది.
అందుకే ఆహారంలో విటమిన్ b6, విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.దీనికోసం ఆకు కూరలు, అవకాడో, మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.
అలాగే జింక్ లభించే చేపలు, బ్రోకలీ, మొలకలు లాంటివి కూడా తీసుకోవాలి.