కుమ్మరి సంఘం నాయకుడిపై పోలీసులకు కక్ష్య దేనికి: మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

నల్లగొండ జిల్లా: హాలియా పట్టణంలో కాంగ్రెస్ పెద్ద నాయకుడిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టాడని అజయ్ అనే కుమ్మరి సంఘం నాయకుడిని పోలీసులు పొట్టు పొట్టు కొట్టడం ఏమిటని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు.బుధవారం హాలియాలో కుమ్మర సంఘం నాయకుడు అజయ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

 Why Is The Police Targeting The Leader Of The Potters Association Ex-mla Nomula-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తూ వరంగల్ బీసీ సభకు వెళ్ళాడని,ఆ అక్కసుతో సోషల్ మీడియాలో జానారెడ్డి వర్ధంతి అనే ఫోటో షేర్ చేశాడనే కారణం చూపి కాంగ్రెస్ నాయకుల ఆదేశాలతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని,తప్పు చేస్తే కేసు పెట్టాలి కానీ,ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube