కుమ్మరి సంఘం నాయకుడిపై పోలీసులకు కక్ష్య దేనికి: మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
TeluguStop.com
నల్లగొండ జిల్లా: హాలియా పట్టణంలో కాంగ్రెస్ పెద్ద నాయకుడిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ పెట్టాడని అజయ్ అనే కుమ్మరి సంఘం నాయకుడిని పోలీసులు పొట్టు పొట్టు కొట్టడం ఏమిటని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు.
బుధవారం హాలియాలో కుమ్మర సంఘం నాయకుడు అజయ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తూ వరంగల్ బీసీ సభకు వెళ్ళాడని,ఆ అక్కసుతో సోషల్ మీడియాలో జానారెడ్డి వర్ధంతి అనే ఫోటో షేర్ చేశాడనే కారణం చూపి కాంగ్రెస్ నాయకుల ఆదేశాలతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని,తప్పు చేస్తే కేసు పెట్టాలి కానీ,ఈ విధంగా చిత్రహింసలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
అయ్యబాబోయ్.. వెన్నులో వణుకు పుట్టించే సీన్! క్షణకాలంలో ప్రాణం బలి..