నేటి రోజుల్లో హెయిర్ ఫాల్( Hair fall ) అనేది అత్యంత సర్వసాధారణంగా వేధిస్తున్న సమస్య.స్త్రీలే కాకుండా ఎంతో మంది పురుషులు కూడా హెయిర్ ఫాల్ కారణంగా సతమతం అవుతున్నారు.
ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని నివారించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.తరచూ హెయిర్ మాస్కులు వేసుకోవడమే కాకుండా ఖరీదైన ఆయిల్, సీరం తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే జుట్టు రాలడం ఆగాలంటే పైపై పూతలే కాదు.పోషకాహారం కూడా తీసుకోవాలి.
వాస్తవానికి కొన్ని ఆహారాలు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని నిత్యం మజ్జిగ( Butter Milk )లో కలిపి తీసుకున్నారంటే హెయిర్ ఫాల్ దెబ్బకు పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడాన్ని అరికట్టే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి వేయించుకొని తీసుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో రెండు కప్పులు కడిగి పూర్తిగా ఆరబెట్టిన కరివేపాకు వేసుకుని కరకల్లాడేలా వేయించుకోవాలి.చివరగా మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి వేయించాలి.

ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న అవిసె గింజలు, కరివేపాకు, జీలకర్ర మరియు మిరియాలు వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.ఇక ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున గ్లాస్ మజ్జిగలో కలిపి ప్రతిరోజు తీసుకోవాలి.కరివేపాకు, అవిసె గింజలు, జీలకర్ర మరియు మిరియాల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇది జుట్టు ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.జుట్టును కుదుళ్ల నుంచి దృఢంగా మారుస్తాయి.
నిత్యం ఇప్పుడు చెప్పుకున్న పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా దూరమవుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు పొడుగ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది.పైగా ఈ పొడి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణవ్యవస్థ పనితీరును చురుగ్గా మార్చి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.గ్యాస్, ఎసిడిటీ వంటి ఇతర జీర్ణ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.