ఈ టెట్ చాలా టఫ్... మాకు ప్రత్యేక టెట్ పెట్టండి

టెట్‌, కాకుండా,తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు( Teachers ) కోరుతున్నారు.దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు.

 This Tet Is So Tough… Give Us A Special Tet-TeluguStop.com

రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ డీఎస్సీ పరీక్ష( DSC Exam )కు ముందే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించి, షెడ్యూల్‌ ప్రకటించింది.

దాని ప్రకారం అభ్యర్థులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు సమ ర్పించాలి.టెట్‌ను కంప్యూ టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ సీబీటీ,పద్ధతిలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించనున్నారు.

ఫలితాలను 20లోపు ప్రకటించనున్నారు.ఈ టెట్‌ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 20న జారీ చేయాల్సి ఉంది.కానీ,కొన్ని సాంకే తిక కారణాల వల్ల నిలిచిపోయింది.ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ టెట్‌పై ఉపాధ్యాయులు కొంత అసంతృప్తితో ఉన్నారు.2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు కచ్చితంగా టెట్‌ పాసై ఉండాలనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.టెట్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారు.రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయులకు టెట్‌ సర్టిఫికెట్‌( Tet Certificate ) లేదు.దాంతో వారికి పదోన్నతులు నిలిపి వేశారు.ఇలాంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రకటించిన టెట్‌ రాసి, ఉత్తీర్ణులు కావాలని ప్రభుత్వం సూచిస్తోంది.

అయితే ఈ టెట్‌లో తాము ఉత్తీర్ణత సాధించలేమని,తమ కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.దీనికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేన్‌, ఎన్‌సీటీఈ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube