మాడుగులపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళన

నల్లగొండ జిల్లా:వరద కాలువ నీళ్లు వదలాలని, కాలువకు ఉన్న తూములను వెంటనే క్లోజ్ చేసి,చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరద కాలువకు నీళ్లు వదిలి 20 రోజులు గడుస్తున్నా మాడుగులపల్లి మండలానికి ఇంతవరకు నీరు చేరుకోవడం లేదని, దీనితో రైతులు చాలా నష్టపోతున్నారని,ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ చివరి ఆయకట్టు అమలకు నీరు చేరే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

 Farmers Are Worried In Madugulapalli Mandal Center , Madugulapalli Mandal Center-TeluguStop.com

రైతుల ఆందోళనతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని,ధర్నా విరమించాలని కోరగా,సంబంధిత అధికారులు వచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube