పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి: దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై శనివారం నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు,మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారిణి,నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన హాజరై మాట్లడుతూ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో అధికారులు,సిబ్బంది బాగా పనిచేశారని,ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్ గా ఉండాలన్నారు.

 Parliament Election Counting Duties Should Handle Carefully Dasari Harichandana,-TeluguStop.com

కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య తలెత్తిన వెంటనే ఆర్వో, ఏఆర్ఓల దృష్టికి తీసుకురావాలన్నారు.

ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఎన్నికల నియమావళి కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే మైక్రో అబ్జర్వర్స్, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించిన సమయం నుండి ఏఏ స్టేజీలలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదనే విషయాలకు సంబంధించి ట్రైనర్ బాలు వారికి విపులంగా వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్,స్పెషల్ కలెక్టర్ పులిచింతల నటరాజన్, డిఆర్డిఓ నాగిరెడ్డి,నల్గొండ దేవరకొండ,హుజూర్నగర్, సూర్యాపేట,చండూరు ఆర్డీవోలు,శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్,జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube