నల్లగొండ జిల్లా:రేషన్ డీలర్ల పోరాటం తీవ్ర రూపందాల్చక ముందే వారి డిమాండ్లను కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించి,పరిష్కరించాలని ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.సోమవారం నార్కెట్‌పల్లి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని వారికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న ధరల ప్రకారం దిగువ మధ్యతరగతికి చెందిన రేషన్ డీలర్లు తమ జీవనాన్ని సాగించాలంటే కేసీఆర్ ప్రభుత్వం తక్షణం క్వింటాల్ బియ్యానికి రూ.70 నుండి రూ.440 వరకు కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం కేరళ,బెంగాల్ రాష్ట్రాల్లో రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న 24 రకాల వస్తువులను పేదలకు తెలంగాణలో కూడా అందించేందుకు కృషి చేయాలని కోరారు.
అందుకోసమే సాగుతున్న రేషన్ డీలర్ల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని తెలిపారు.ఈ ధర్నాలో తేరటుపల్లి ఉపేందర్,రుద్ర లింగయ్య,శిగ భిక్షంగౌడ్,గోసుల గణేష్,బొప్పని విజయ,గుఱ్ఱం సత్యం,కంచర్ల అనంతరెడ్డి,ఈపూరి నీరజ,చిరుమర్తి అశోక్,సింగిరెడ్డి పద్మారెడ్డి,ఎడమ వెంకటరెడ్డి,సునంద మరియు పీఆర్ పీఎస్ నాయకులు ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,పోతెపాక విజయ్, ఎన్నమళ్ళ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.