నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వరంగల్ డిక్లరేషన్ ను గ్రామ గ్రామాలకు చేర్చటానికి “రైతు రచ్చబండ” పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటానికి కాంగ్రేస్ అధిష్టానం ప్రతి జిల్లాలో ఒక ఇంచార్జీని నియమిస్తోంది.
ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా రైతు రచ్చబండ ఇంఛార్జిగా నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహరెడ్డిని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించినట్లు సమాచారం.ఆదివారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట రూరల్ మండలం యండ్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ దుబ్బాక నర్సింహరెడ్డి తొలిసారిగా పాల్గొననున్నారని తెలుస్తోంది.







