దశాబ్దాల నిరీక్షణకు నెలలోనే క్లియరెన్స్: కట్టెబోయిన అనిల్

నల్లగొండ జిల్లా:దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులకు కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) ఆరు నెలల్లో చరమగీతం పాడిందని ఏకే ఫౌండేషన్ చైర్మన్( AK Foundation Chairman ),కాంగ్రెస్ పార్టీ నేత కట్టెబోయిన అనిల్ కుమార్ అన్నారు.నల్లగొండ జిల్లా( Nalgonda District ) హాలియాలో తన నివాసంలో ఆయన మాట్లడుతూ గత పదేళ్లుగా ప్రతీ ఎన్నికల ముందు పదోన్నతులపై రేపు,మాపంటూ ఊరిస్తూ తర్వాత ఉపాధ్యాయుల గురించి ఊసే ఎత్తని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి,ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరదింపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా అని,దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేలాది మందికి పదోన్నతులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

 Clearance Within A Month After Decades Of Waiting: Katteboina Anil ,congress Go-TeluguStop.com

2015 నుండి ఉపాధ్యాయులకు( Teachers ) పదోన్నతులు లభించక వేలాదిమంది పదోన్నతులు రాకుండానే ఉద్యోగ విరమణ పొందడం జరిగిందని,1800 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతి కల్పించగా, 10500 మంది లాంగ్వేజ్ పండిట్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించారని చెప్పారు.మరో 10000 మంది ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్,ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా వివిధ సబ్జెక్ట్ లలో పదోన్నతి కల్పించడం చారిత్రాత్మమైనదన్నారు.

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడంతో యావత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘాలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని,ప్రతి గూడెంలో పాఠశాల వుండాలని చెప్పడంతో పాటు ఒకఉపాధ్యాయుడు వుండాలని చెప్పడం విద్యాశాఖ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన విద్యాశాఖకు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube