నల్లగొండ జిల్లా: గురువారం ఉదయం డ్యూటీకి వెళ్ళిన వ్యక్తి సాగర్ ఎడమ కాలువలో శవమై తేలిన సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)మండలంలో వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… తక్కేళ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని బండమీద గూడెం</em(Bandamida gudem) గ్రామానికి చెందిన నారబోయిన హరికృష్ణ(Naraboina Harikrishna) (32)గురువారం పెద్దదేవులపల్లిలోని రెడ్డీస్ ఫ్యాక్టరీ(Reddy’s Factory)లో డ్యూటీకి వెళ్ళాడు.
సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా వేములపల్లి సమీపంలో బిడ్జ్ సాగర్ కాల్వకట్టలపై బైకు, చెప్పులు లభ్యమయ్యాయి.అనుమానంతో సాగర్ కాలువలో వెతకగా సూర్యాపేట జిల్లా మేడారం వద్ద శుక్రవారం ఉదయం మృతదేహం లభించింది.
హరికృష్ణ అత్తగారి ఊరు పెద్దదేవులపల్లి కావడం,ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగటంతో హరికృష్ణ మృతిపై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.