నాగార్జునసాగర్ ను ఆధ్యాత్మిక,పర్యటక కేంద్రంగా మారుస్తాం:మంత్రి జూపల్లి కృష్ణారావు

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ లోని బుద్ధవనానికి ఆసియా ఖండంలోని శ్రీలంక(Sri Lanka) ఇతర దేశాల నుండి బౌద్ధులు వస్తారని,వారికి అవసరమైన సౌకర్యాలు,వసతులు కల్పిస్తే ఇంకా ఎక్కువ దేశాల నుండి బౌద్ధులు వచ్చే అవకాశం ఉందని,అందుకే సాగర్, బుద్ధవనం పరిసరాల్లో ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యంతో స్టార్ హోటల్స్ నిర్మాణం చేసి, ఆధ్యాత్మిక,పర్యటక కేంద్రంగా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శుక్రవారం నాగార్జునసాగర్ బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కమలేష్ డి.

 We Will Turn Nagarjunasagar Into A Spiritual And Tourist Centre- Minister Jupall-TeluguStop.com

పాటిల్ (దాజి)తో కలిసి మంత్రి సందర్శించారు.ముందుగా విజయ విహర్ లో బుద్ధవనం లే-అవుట్,విజయ విహార్ లేఔట్లను పరిశీలించి,మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బుధవనంలో ఉన్న విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి.

ప్రకాష్ రెడ్డి,బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డిలు మంత్రికి,దాజికి వివరించారు.బుద్ధవనం పరిసర ప్రాంతాలతో పాటు,విజయ విహార్ లో ఉన్న స్థలం వివరాలు,అలాగే సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి వివరాలు సమర్పించాలని,ఈ సందర్భంగా మంత్రి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు.అనంతరం మంత్రి,దాజితో కలిసి బుద్ధవనం పక్కన ఉన్న విపాసన ధ్యాన కేంద్రం పరిసర ప్రాంతాలను,ఇతర ప్రదేశాలను పరిశీలించారు.

స్థానిక ఎమ్మేల్యే కె.జైవీర్ క్యాంపు ఆఫీస్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ ను అభివృద్ధి చేసేందుకు,ప్రత్యేకించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పర్యటకశాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బుద్ధవనం చూడడానికి ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ఆషియా దేశాల నుండి ఎంతోమంది బౌద్దులు,ఇతరులు వస్తున్నారని,ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ సమీపంలో ఉన్న రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాజితో కలిసి సందర్శించినట్లు తెలిపారు.

స్టార్ హోటల్,వాటర్ స్పోర్ట్స్ తో అందుబాటులో ఉండే విధంగా కాటేజీల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, నాగార్జునసాగర్ తో పాటు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం పెద్ద ఎత్తున టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.అంతకుముందు విజయ్ విహార్ లో స్థానిక ఎమ్మెల్యే జైవీర్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేకంగా కృష్ణానది సమీపంలో ఉండడం,కొండలు, ఇక్కడ పరిసరాలు,బుద్ధవనం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంచి ఆస్కారం ఉందన్నారు.

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డి,ఓఎస్డీ సూధన్ రెడ్డి,బుద్ధిష్ట్ కన్సల్టెంట్ శివనాగిరెడ్డి, బుద్ధవనం డిజైనర్,ఇంచార్జ్ శ్యాంసుందర్,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube