ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు...!

BJP Leaders Burnt The Effigy Of The Government , BJP Leaders, Nalgonda , Brs , TSPSC

నల్లగొండ జిల్లా:పోటీ పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో బీజేపీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ టిఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల పేపర్ లీకులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Bjp Leaders Burnt The Effigy Of The Government , Bjp Leaders, Nalgonda , Brs , T-TeluguStop.com

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించలేని ఈ చేతకాని అసమర్ధ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.లీకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టిఎస్పిఎస్సి బోర్డును రద్దు చేసి,చైర్మన్ మరియు పాలక మండలిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలోరాష్ట్ర,జిల్లా,పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube