ఆంధ్రప్రదేశ్ లో ఎంత కాదనుకున్నా ప్రాంతీయ పార్టీ ల హవా ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది…అప్పుడప్పుడు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ తన ప్రభావం చూపినప్పటికీ అది అప్పటి లోకల్ నాయకుడి బలం బట్టి ఆధారపడి ఉంటుంది…ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నేత కారణం గా ఒక దశలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగింది….రాష్ట్రం లోనే కాకుండా దేశం లో కూడా తన అత్యున్నత దశను చూసింది…అయితే రాజశేఖరరెడ్డి మృతి తర్వాత పరిణామాలు పూర్తిగా తలకిందులయ్యాయి….
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లోనే కాకుండా దేశం మొత్తం మీద తన వైభవాన్ని కోల్పోయింది…ఇదే సమయం లో అదును చూసుకుని అవకాశాన్ని అందిపుచ్చుకుంది మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ…
దొరికిన అవకాశమే తడవుగా పటిష్ట నాయకత్వం తో ,బలమైన నిర్ణయాలతో ,హైటెక్ ప్రచారాలతో విస్తృతం గా ప్రజల్లోకి వెళ్లి దేశం నలుమూలలా అనేక రాష్ట్రాల్లో తన సత్తా చాటి అత్యంత బలమైన శక్తి గా ఎదిగింది…అదే విధంగా గా ఒక తెలుగు రాష్ట్రమైన తెలంగాణ లో కూడా ఇప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ అధికారం వైపు అడుగులు వేస్తుంది….అయితే ఆంధ్రప్రదేశ్ రాష్టం( Andhra Pradesh ) మాత్రం ఈ హవా కు అతీతం….ఆంధ్ర లో బీజేపీ ( BJP ) ప్రణాళికలు ,పార్టీ పెద్దల వ్యూహాలు ,బలాబలాలు పని చేస్తున్నట్టు ఎప్పుడూ కనిపించిన దాఖలాలు లేవు…ఎప్పుడైనా ఏదైనా పొత్తులో భాగం గా తమ వారిని గెలిపించుకోవాలే కానీ సొంతం గా బీజేపీ బలం ఇక్కడ శూన్యం…ఇదే విషయం ఎప్పటికప్పుడు నిరూపణ అవుతునే ఉంది…

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల MLC ఎన్నికల్లో( Graduate MLC Elections ) ఇదే సీన్ రిపీట్ అయింది…అత్యంత దారుణం గా బీజేపీ MLC అభ్యర్ధి PVN మాధవ్ కి( PVN Madhav ) పోలైన ఓట్ల కంటే చెల్లుబాటు అవని ఓట్లు ఎక్కువ వచ్చాయి….దేశం మొత్తం మీద అత్యంత ప్రభావవంతంగా ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ కి ఇది తలదింపుల విషయం…గతం లో కూడా పొత్తు లేకుండా జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ప్రభావం సున్నానే… ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం ఎంత మేరకు సీరియస్ గా భావిస్తుందో చూడాలి…

అయితే రాష్ట్రం లో పొత్తు ఉన్న జనసేన తో సంప్రదించి ప్రచారం చెయ్యకపోవడం ,రాష్ట్రానికి ప్రతి బడ్జెట్ లో మొండి చేయి చూపించడం తో పాటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చిన్న చూపు చూడటం,ప్రత్యేక హోదా సహా అనేక ముఖ్యమైన హామీలు నెరవేర్చకపోవడం లాంటి అనేక కారణాలు ఇక్కడి బీజేపీ పరిస్థితికి కారణాలుగా కనిపిస్తున్నాయి….ఆంధ్రప్రదేశ్ లో పట్టు సాధించాలి అన్న కోరిక ఏ మాత్రం ఉన్నా బీజేపీ నాయకత్వం వెంటనే పై విషయాలపై దృష్టి సారించి ఆంధ్ర ప్రజల మనసు గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది….