ఇక తెలంగాణలో బడిబాట

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై తెలంగాణ సర్కార్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది.గురువారం నుంచి 19వ,తేదీ వరకు ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనుంది.

 Telangana Govt Schools Badibata Program, Telangana Govt Schools, Badibata Progra-TeluguStop.com

కాగా, ఈ బడిబాట కార్యక్రమాన్ని తొలుత జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాలని భావించింది.కానీ,ఈ తేదీలను విద్యాశాఖ రీషెడ్యూల్ చేసింది.

బడి బాటలో భాగంగా స్కూల్ ఏజ్ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్చేలా,ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చూడాల్సి ఉంటుంది.చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చేర్పించాలని పేర్కొంది.

కాగా,బడిబాటలో భాగంగా కలెక్టర్ల నుంచి మొదలు డీఈవో,ఎంఈవో, హెడ్ మాస్టర్,టీచర్ వరకూ ప్రతి ఒక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగించారు.

బడిబాటలో భాగంగా తొలిరోజు గురువారం గ్రామాల్లో పలు ఆర్గనైజేషన్లతో సమావేశాలు నిర్వహించి అడ్మిషన్లు పెరిగేలా చూడాల్సిన బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఏఏపీసీ మెంబర్లు,హెచ్ఎం, టీచర్లు,పేరెంట్స్‌పై ఉండనుంది.8 నుంచి 10 వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి అంగన్ వాడీతో పాటు ప్రభుత్వ స్కూళల్లో అన్ని క్లాసుల వారీగా అడ్మిషన్లు పొందేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.11న గ్రామసభ నిర్వహించి పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.ఇదిలా ఉండగా ఈనెల 12న పాఠశాల పున:ప్రారంభం కానుంది.13న ఫౌండేషన్ లిటరసీ ప్రోగ్రామ్, లర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్,14న సామూహిక అక్షరాభ్యాసం,15న ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ డే అండ్ గర్ల్ ఎడ్యుకేషన్ డే,18న డిజిటల్ క్లాసులు,ప్లాన్టేషన్ పై అవేర్ నెస్ కల్పించనున్నారు.19న స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube