ఏపీలో టీడీపీ కూటమి( TDP Alliance ) అధికారంలోకి రావడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే వైసీపీకి( YCP ) అనుకూలంగా పని చేసిన కొందరు అధికారులకు చంద్రబాబు( Chandrababu ) నివాసంలోకి వచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు.
చంద్రబాబును కలిసేందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులు( Former Chief of Intelligence Anjaneyulu ) ప్రయత్నించారు.ఈ మేరకు పీఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
అయితే ఆయన కారును ఆపేసిన పోలీసులు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు.
దీంతో చంద్రబాబు నివాసం నుంచి ఆంజనేయులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
అదేవిధంగా మరో ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని( Kolli Raghuramireddy ) కూడా పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.కాగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఎన్నికల సమయంలో ఆంజనేయులు, రఘురామిరెడ్డిని ఈసీ తప్పించింది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ హయాంలో మచ్చ తెచ్చుకున్న అధికారుల పట్ల చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారని తెలుస్తోంది.