మాజీ మంత్రి రోజాపై( Ex Minister Roja ) సొంత పార్టీ నాయకురాలు కేజే శాంతి( KJ Shanthi ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రోజా ఓటమితో నగిరిలో( Nagiri ) ప్రజలు పండుగ చేసుకుంటున్నారని తెలిపారు.
నగిరి నియోజకవర్గంలో పదేళ్లుగా ఉన్న శని, పీడ పోయిందని కేజే శాంతి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే రోజా అరాచక నాయకత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారని ఆమె తెలిపారు.
ప్రస్తుతం నగిరికి మంచి రోజులు వచ్చాయని కేజే శాంతి వ్యాఖ్యానించారు.రోజా అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీకి ( YCP ) కూడా శని పట్టిందని ఆమె వెల్లడించారు.
ప్రజలు రోజాకు తగిన బుద్ధి చెప్పారన్న కేజే శాంతి రాష్ట్రంలో ఎక్కడ కనిపించే పరిస్థితులు ఇంక ఉండవని స్పష్టం చేశారు.