ఎండిన భారీ వృక్షాలతో పొంచి ఉన్న ప్రమాదం..!

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో రహదారుల పక్కన, అలాగే మునగాల మండలం బరాఖత్ గూడెం నుండి ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వరకు గల ప్రధాన రహదారిపై నడిగూడెం,కాగితరామచంద్రపురం గ్రామాల మధ్య రహదారికి ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఎండిపోయి ఉన్నాయని,ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే గుండెల్లో గుబులు పుట్టిస్తోందని వాహనదారులు వాపోతున్నారు.వర్షాకాలం రావడంతో వర్షాలతో పాటు గాలి దుమారాలకు ఎండిన కొమ్మలు విరిగిపడే అవకాశం ఉండడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉన్నదని, ప్రధానంగా మండల కేంద్రంలో గల కస్తూర్బా పాఠశాల వెళ్లే రహదారికి ఇరువైపులా వృక్షాలకు ఎండిన కొమ్మలు ఎక్కువగా ఉన్నాయని,

 Hazard Covered By Dry Heavy Vegetation, Hazard , Dry Heavy Vegetation, Dried Tre-TeluguStop.com

రహదారిపై ఎంఈఓ,వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయాలకు పనుల నిమిత్తం ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారని, రైతులు దారివెంట వ్యవసాయ పనులకు వెళ్తుంటారని,మరో వారంలో పాఠశాలలు ప్రారంభమవుతున్నందున పాఠశాలకు విద్యార్థులు వస్తారని,ఎండిన కొమ్మలు ఎప్పుడు విరిగి పడతాయోనని ప్రాణాలు అరచేతుల పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

రహదారి వెంట కరెంటు తీగలు ఉన్నందున కొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడితే పెద్ద స్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.ఎండిన వృక్షాల కొమ్మలు తొలగించి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube