చర్లపల్లిలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు అడ్డుగోడ

నల్లగొండ జిల్లా: గత మూడు సంవత్సరాల క్రితం చర్లపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.

 Ambedkar And Babu Jagjivan Ram Idols In Charlapalli, Ambedkar ,babu Jagjivan Ram-TeluguStop.com

అంబేద్కర్,బాబూ జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కానీ,చర్లపల్లి గ్రామానికి చెందిన కొందరు కుల దురాహంకారంతో పొద్దు పొద్దున్నే అంబేద్కర్,జగ్జీవన్ రామ్ ముఖం మేము చూడాలా అని,వాటిని తీసివేయాలని జిల్లా కలెక్టర్ ను కలిసినా కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో బొడ్రాయి నిర్మాణం చేసే సాకుతో మహనీయుల విగ్రహాలు కనిపించకుండా 15 ఫీట్ల ఎత్తున అక్రమ గోడ నిర్మాణం చేయడానికి రెండు పిల్లర్లు వేయడం దుర్మార్గమైన చర్యని, వెంటనే గోడ నిర్మాణాన్ని ఆపేయాలని కుల,సామాజిక, విద్యార్ది,ప్రజా సంఘాల నేతల డిమాండ్ చేశారు.ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహనీయుల విగ్రహం కనిపించకుండా కుట్రపన్నే వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని,

అక్రమనిర్మాణాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు.

అక్రమ నిర్మాణాలు ఆపనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల జగన్, ఎస్సీ,ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, మాల మహానాడు రాష్ట్ర నేత రేఖల సైదులు,బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, టిఆర్ఎస్వీ నాయకులు, తెలంగాణ సోషలిస్టు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ల ప్రసాద్,ఎస్సీ సెల్ కాంగ్రెస్ దళిత సంఘం అధ్యక్షుడు పెరిక అంజయ్య,స్వేరోస్ జిల్లా నాయకులు బొజ్జ పాండు, వేణు,చర్లపల్లి గ్రామస్తులు ఏర్పుల శేఖర్,బొజ్జరాజు, కట్టెల కుమార్,సుధీర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube