నీకు దమ్ముంటే బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చు:మాజీ ఎమ్మెల్యే కంచర్ల సవాల్

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చాలని అధికారుల మీద వత్తిడి తేవడం కాదు.దమ్ముంటే నువ్వు వచ్చి కూల్చు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సవాల్ విసిరారు.

 Demolish The Brs Office If You Dare Challenge Of Former Mla Kancharla, Demolish-TeluguStop.com

జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలన చేతకాక కోడిగుడ్డు మీద ఈకలు లెక్కపెడుతున్న కోమటిరెడ్డి… నీ వైఖరి మార్చుకో అని ఉచిత సలహా ఇచ్చారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలతో ఫోజులివ్వడం తప్పా కొత్తగా చేస్తున్న అభివృద్ది ఏమి లేదని ఎద్దేవా చేశారు.

కోమటిరెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, అభివృద్ది గడప దాటడం లేదన్నారు.మా పార్టీ కార్యాలయాన్ని కూల్చడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడని, కూలుస్తా కూలుస్తానన్న గొప్పోల్లే పావురాల గుట్టలో పావురమై పోయిర్రని,నీకూ అదే గతి పడుతుందని శాపనార్థాలు పెట్టారు.

నిబంధనలు,అనుమతుల ప్రకారమే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం జరిగిందని,నిబంధనల ప్రకారం మాట్లాడితే హైద్రాబాద్ లో గాంధీభవన్ తో సహా తెలంగాణలోని అన్ని పార్టీల కార్యాలయాలు కూల్చేయాల్సి వస్తుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube