నల్లగొండ జిల్లా: సంక్షేమ హాస్టల్స్ సమస్యల నిలయాలుగా మారాయని,వసతులు కల్పించడంలో నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.బుధవారం నల్లగొండ పట్టణంలోని ఎస్సి బాలుర హాస్టల్స్ సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ లోపభూయిష్టంగా ఉన్నాయని,ఆహార నాణ్యత లోపంగా ఉందని, వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
హాస్టళ్లలో ఫ్యాన్లు తిరగడం లేదని,దోమలు బెడడతో డెంగ్యూ,మలేరియా ఇతర విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.
సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లు సక్రమంగా విధులకు హాజరైనప్పటికీ వసతులు కల్పించి,నాణ్యమైన భోజనం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం విఫలమవుతున్నారని, కిరాయి బిల్డింగులకు వేల రూపాయలు కిరాయిలు ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికి సరైన వసతులు లేవన్నారు.
తక్షణమే జిల్లా అధికారులు పరిశీలించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈనెల 1నుండి 10వ తేదీ వరకు వరకు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ లో సర్వే నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.