నాంపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

నల్లగొండ జిల్లా: ప్రభుత్వాలు మారినా నాంపల్లి తలరాత మాత్రం మారలేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖి అన్నారు.నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాంపల్లి అధ్యక్షుడు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని అంబేద్కర్ చౌరాస్తలో రాస్తారోకో నిర్వహించారు.

 A Degree College Should Be Established At Nampally, Degree College ,nampally, Na-TeluguStop.com

ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మూడు జూనియర్ కళాశాలలు వున్న మండల కేంద్రంలో తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి,పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేయాలన్నారు.ఇంటర్ విద్య తర్వాత దూర ప్రాంతాలకి వెళ్లి చదవలేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని,

డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేస్తే ఉన్నత విద్యతో పాటు,వృత్తివిద్య కోర్సులు కూడా అందుబాటులోకి ఉంటాయన్నారు.

మండల అధ్యక్షుడు నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మాల్,దేవరకొండ,నల్గొండ, హైద్రాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి చదవలేక విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి డిగ్రీ,పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చేలా చూడాలని కోరారు.

అదేవిధంగా మండల నాయకులుగా చెలామణి అవుతున్న అన్ని పార్టీల నాయకులు

ఈ న్యాయమైన డిమాండ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.లేనియెడల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊర్లో 20,30 నామినేషన్లు వేసి మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే వరకు ఉద్యమిస్తామన్నారు.

డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు,ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో బీజేవైఎం నాయకులు చిరుమామిళ్ల గిరి,జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్,పొలగోని శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శులు శివ గౌడ్,మేకల శ్రీకాంత్, స్వామి,ధరమ్ సింగ్, శ్రీకాంత్,శ్రీధర్ రెడ్డి,శివ, లవకుమార్,విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube