రైతులకు ఉచిత 24 గంటల కరెంటు ఉత్తి మాటే: రొండి శ్రీనివాస్

నల్లగొండ జిల్లా: రైతులకు ఉచిత 24 గంటల కరెంటు ఉత్తి మాటేనని సిపిఎం నల్లగొండ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్వాయి రామిరెడ్డి అన్నారు.గురువారం వేములపల్లి మండల పరిధిలోని బుగ్గ బాయ్ గూడెం సబ్స్టేషన్ ముందు సిపిఎం,రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఇస్తానన్న 24 గంటల కరెంటు కొరత లేకుండా ఇవ్వాలని ధర్నా నిర్వహించారు.

 Nalgonda Cpm Leader Rondi Srinivas Abour Farmers 24 Hours Free Current, Nalgonda-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తానని చెప్పి ఇప్పుడు సర్వీస్ ఛార్జీల పేరుతోటి రైతుల నుండి కరెంటు చార్జీలు వసూలు చేస్తూ 24 గంటల కరెంటు ఇవ్వకుండా ఉత్త మాటలు చెబుతుందని మండిపడ్డారు.

రైతులు బోర్ల కింద వరి పైర్లు వేసుకొని రెండు నెలలు దాటిందని,ఈ సమయంలో ఇంకొక్క నెల రోజులు అయితే ముందుగా పెట్టిన పొలాలు రైతాంగానికి చేతికొచ్చే పరిస్థితి ఉందని,కానీ,ఈ సమయంలో రైతులకు సరైన కరెంటు ఇవ్వకుండా లో వోల్టేజ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

ఇప్పుడు కేవలం 12 గంటలు మాత్రమే ఇస్తున్నారని,అది కూడా లో ఓల్టేజ్ తో ఇవ్వడతో రైతుల మోటార్లు,స్టార్టర్లు కాలిపోతున్నాయన్నారు.

విద్యుత్ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని రైతులకు ఇచ్చే 12 గంటలైనా సరైన ఓల్టేజ్ తో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేనియెడల మరోసారి విద్యుత్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు చల్లబట్ల ప్రణీత్ రెడ్డి, రెమిడాల భిక్షం, పుట్టల సైదులు,బొంగర్ల వెంకటయ్య,అనిల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సోమనబోయిన వెంకన్న, రేఖ కృష్ణమూర్తి,రేఖ సురేష్,కోట్ల రవీందర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube