నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డుపై ప్రవహిస్తూ నిలువ ఉన్న అత్యంత దుర్గంధపూరితమైన మురుగు కాలువలను తక్షణం బాగుచేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.శనివారం నకిరేకల్ పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడాతూ నోముల,పాలెం,ఓగోడు,వల్లభాపురం,గుడివాడ, బొప్పారం,కాసనగోడు లాంటి గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారి వాణిజ్య,వ్యాపారాలతో అవసరాల దృష్ట్యా నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటోందన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళే దారి కూడా ఇదే గమనార్హం అన్నారు.ఇక్కడి మురుగు కాల్వలు పూర్తిగా మురుగుమయమై, జలమయమయమై,ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు సతమతమతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్,ఛైర్మన్,కమీషనర్ తక్షణమే స్పందించి దీనిని బాధ్యతగా భావించి బాగుపర్చాలని కోరారు.లేనిచో మున్సిపల్ ఆఫీస్ ను ప్రజలతో ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నూకల నాగరాజుయాదవ్,పెరుమాండ్ల సైదులు,గద్దపాటి సైదులు,చిట్టిమళ్ళ సైదులు,మేడి కిరణ్,మహేశ్వరం నరసింహ,ఊడుగు భిక్షం,పంజాల ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.