సనాతన హిందూ ధర్మం ప్రకారం భగవంతుని ఆరాధన ఎంతో ముఖ్యమైనది.హిందువుల నమ్మకం ప్రకారం ప్రతి రోజు ఉదయం ఇష్టమైన దేవుడిని పూజించి కుటుంబంపై ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
తనను కోరి కొలిచే భక్తుల ఇంట సంతోషం, శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే భగవంతుడిని ఆరాధనకు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉన్నాయి.హిందూ ధర్మం ప్రకారం హారతి ఇవ్వని ఆరాధన అ సంపూర్ణంగా భావిస్తారు.
అటువంటి పరిస్థితులలో పూజలో భాగంగా భగవంతుడి ముందు దీపం వెలిగించి పూజను మొదలు పెట్టాలి.చివరికి హారతి( Harati ) ఇచ్చి పూజను ముగించాలి.అలాగే హారతి ఇచ్చే సమయంలో కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుని ఆరాధనలో హారతి చాలా ముఖ్యమైనది.పూజ పూర్తి చేసిన తర్వాత కచ్చితంగా హారతిని ఇస్తారు.
అంతేకాకుండా ఉదయం, సాయంత్రం దైవాన్ని పూజించే సమయంలో ప్రతిరోజు హారతి ఇస్తూ ఉంటారు.

దేవుడికి హారతి ఇచ్చే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.భగవంతుని పూజలో నిలబడి హారతి ఇవ్వాలనే నియమం ఎప్పటినుంచో ఉంది.అయితే ప్రత్యేక పరిస్థితులలో కూర్చొని కూడా హారతి ఇవ్వవచ్చు.
హిందూ సంప్రదాయం( Hindu tradition ) ప్రకారం శరీరకంగా నిలబడలేకపోతే లేదా అనారోగ్యంగా ఉంటే దేవునికి క్షమాపణలు చెబుతూ కూర్చొని హారతి ఇవ్వవచ్చు.హారతి ఇచ్చిన తర్వాత భక్తుడు లేదా ఇతర వ్యక్తులు నేరుగా హారతి తీసుకోకూడదు.

హారతి ఇచ్చిన తర్వాత ముందుగా నీటిని దీపం( Water lamp ) దగ్గర ఉంచాలి.దీని తర్వాత పూజ పవిత్ర జలాలను అందరిపై చల్లాలి.ఆ తర్వాత హారతి ఇచ్చిన వ్యక్తి మొదట హారతి తీసుకోవాలి.ఆ తర్వాత అందరికీ దర్శించుకునే విధంగా చూపించాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో ఇచ్చే హారతినీ ముందుగా నాలుగు సార్లు భగవంతుని పాదాల వైపు, రెండుసార్లు నాభి వైపు, చివరకు ఒకసారి దైవముఖం వైపు తిప్పడం ద్వారా హారతిని పూర్తి చేయాలి.