నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్( Nagarjuna Sagar ) నియోజకవర్గ పరిధిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కళ్ళ కలకలతో
ఇబ్బందులు పడుతుంటే, వారిని సంరక్షించాల్సిన వార్డెన్లు అందుబాటులో లేకుండాపోయారని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను( Kondeti Srinu ) ఆగ్రహం వ్యక్తం చేశారు.కెవిపిఎస్ ఆధ్వర్యంలో హాస్టల్స్ సర్వే చేస్తున్న సందర్భంగా గురువారం హాలియా హాస్టల్ లో సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్,మెస్ చార్జీలు, పెంచాలని,అద్దె భవనాల్లో మౌలిక వసతులు లేవని, వానొస్తే వలవల గాలొస్తే గలగల అన్నట్లుగా ఉన్నాయని,బాత్రూమ్స్, లెట్రిన్సు,ఫ్యాన్లు,రూంలకు తలుపులు,బేడాలు లేవని, చుట్టు ప్రహరీ గోడలు, గేట్లు లేక పందులు, పాములు,తేల్లు, వస్తున్నాయని,బాలికల హాస్టల్ లో వాచ్మెన్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
హాస్టల్స్ కి వెంటనే సొంత భవనాలు నిర్మించాలని, పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ నోట్ బుక్స్,దుప్పట్లు,పెట్టెలు, ఇవ్వలేదన్నారు.హాస్టల్ కి వార్డెన్లు రెగ్యులర్ గా రాకుండా వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే వస్తున్నారని,ఒక్కో వార్డెన్ కి మూడు నాలుగు హాస్టల్ ఇన్చార్జ్ ఇచ్చారని, ప్రభుత్వం రెగ్యులర్ వార్డెన్ నియమించాలని కోరారు.
మెనూ సక్రమంగా అమలు చేయట్లేదని,పండ్లు,గుడ్లు, చికెన్ ఇవ్వట్లేదని, అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టట్లేదన్నారు.సాంఘిక సంక్షేమ హాస్టల్స్( Social welfare hostels ) పై అధికారుల పర్యవేక్షణ లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు జీవన్, విద్యార్థులు పాల్గొన్నా
.