ఎల్ఆర్ఎస్ కటాఫ్ డేట్ తో ఇబ్బందులు...!

నల్లగొండ జిల్లా: ఇటీవల రాష్ట్రంలో లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)పై పెద్ద ఎత్తున దుమారం రేగింది.ఇటీవల ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అనధికారిక మరియు అక్రమ లే అవుట్ లకు సంబంధించి లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) విషయంలో 2020 సంవత్సరంలో చేసుకున్న దరఖాస్తులకు ప్రభుత్వం నుండి ఉన్న అడ్డంకులు తొలగించి వాటిని పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

 Difficulties With Lrs Cutoff Date, Lrs Cutoff Date, Land Registration Scheme, R-TeluguStop.com

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2020 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న వారికి లబ్ధి చేకూరనుంది.అయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ, 23.14148/PLG.III/2020.తేదీ 30-12-2020 జారీ చేశారు.అందులో అనధికారిక మరియు అక్రమ లే అవుట్ లకు సంబంధిచి బిల్డింగ్ పర్మిషన్ విషయమై 2020 ఆగస్టు 26 ను కటాఫ్ డేట్ గా పరిగణించి,

ఆ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ చేయబడ్డ అనధికారిక మరియు అక్రమ లే అవుట్ లకు సంబంధించిన ప్లాట్లకు బిల్డింగ్ పర్మిషన్ ను నిలుపుదల చేశారు.

దీనితో ఆ తర్వాత కొన్నవారికి లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) క్రింద కనీసం దరఖాస్తు చేసుకొనుటకు కూడా అవకాశం లేకుండా పోయింది.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కటాఫ్ డేట్ తరువాత అనధికారిక మరియు అక్రమ లే అవుట్ నందు ప్లాట్లు కొన్న చాలా మంది గత మూడేళ్లు స్వంత ఇల్లు నిర్మించుకోవడానికై బిల్డింగ్ పర్మిషన్ కొరకు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం 2020 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ తెలంగాణ వారు రూపొందించిన మెమోలో పేర్కొన్న కటాఫ్ డేట్ 26-08-2020 పై సమీక్షించి,

ఆ యొక్క తేదీని పొడిగించడం కానీ, ఎత్తివేయడం కానీ,చేస్తే ఆ తేదీ తరువాత అనధికారిక మరియు అక్రమ లే అవుట్ నందు ప్లాట్ కొన్న చాలా మందికి అడ్డంకులు తొలగి బిల్డింగ్ పర్మిషన్ కి అనుమతి లభిస్తుందని కోరుతున్నారు.ఇలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉందని,బాధితుల బాధలు కూడా తొలగిపోతాయని అంటున్నారు.

ఎల్ఆర్ఎస్ కటాఫ్ డేట్ తొలగించాలని చౌటుప్పల్ కు చెందిన రియల్టర్ చిక్క శ్రీనివాస్,ఆలేరుకు చెందిన రియల్టర్ చెక్క వెంకటేశ్ అంటున్నారు.ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫీజు కట్టి నాలుగేళ్లు అవుతుందని, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని,ప్లాట్ల క్రయవిక్రయాలకు,ఇంటి పర్మిషన్ కు మస్తు ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు.

ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీని పూర్తిగా ఎత్తేసి అన్ని ప్లాట్లకు కొనుగోలు అవకాశాలు కలిపించాలని,ఎల్ఆర్ఎస్ విషయంలో గత ప్రభుత్వం పెట్టిన కటాఫ్ డేట్ పట్ల అనేక మంది ఆందోళనలో ఉన్నారని,ప్లాట్లు కొనుక్కొని మూడు నాలుగేళ్ల అయినా ఇళ్లు కట్టుకునే అవకాశం లేకుండా పోయిందని, ప్రభుత్వం కటాఫ్ డేట్ ను పూర్తిగా ఎత్తేసి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube